Published : 15/11/2021 15:24 IST

S 400: ఎస్‌-400 ఆంక్షలపై కచ్చితంగా చెప్పలేం: అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఎటువంటి ఆంక్షలు విధించలేమని కచ్చితంగా చెప్పలేమని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి వెల్లడించారు. ఎవరికి పూర్తిగా లేదా కొన్ని అంశాలకు సంబంధించి కచ్చితమైన మినహాయింపులు ఇవ్వాలని కాట్సా(కౌంటరింగ్‌ అమెరికాస్‌ యాడ్వెర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌) చట్టంలో లేదని వివరించారు. ఇటీవల కాలంలో భారత్‌-అమెరికా రక్షణ బంధాలు బలపడ్డాయని  అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని వెల్లడించారు.

రష్యా ఎస్‌-400 వ్యవస్థల డెలివరీలను మొదలు పెట్టిందని ఇప్పటికే ప్రకటించడంతో అమెరికా స్పందించింది. ఇప్పటికే జోబైడెన్‌ కార్యవర్గం.. మిత్రదేశాలు రష్యాతో లావాదేవీలకు దూరంగా ఉండాలని కోరింది.

2019లో అక్టోబర్‌లో రష్యా నుంచి 5.43 బిలియన్‌ డాలర్ల విలువవైన ఎస్‌-400 వ్యవస్థ కొనుగోళ్లకు భారత్‌ అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసింది. కానీ, రష్యా నుంచి కోనుగోలు చేసే ఎస్‌-400 కారణంగా భారత్‌పై కాట్సా ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత రష్యాపై ఈ ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ఏదైనా భారీ రక్షణ రంగ పరికరాలను కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. కాట్సా చట్టం ప్రకారం ఇరాన్‌, ఉ.కొరియాతో కొన్ని రకాల లావాదేవీలు జరిపినా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని