Vladimir Putin: పచ్చిక బయళ్లలో తిరుగుతూ చేపలు పట్టిన రష్యా అధ్యక్షుడు‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పచ్చిక బయళ్లలో ఓ సాధారణ పౌరుడిలా తిరుగుతూ చేపలు పట్టారు

Updated : 27 Sep 2021 05:03 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరివారంలో కొందరికి కరోనా సోకడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, స్వీయ నిర్బంధం ముగిసిన తర్వాత ఆయన సైబీరియాలో చాలా రోజులు సెలవుల్లో గడిపారు. అక్కడే పచ్చిక బయళ్లలో ఓ సాధారణ పౌరుడిలా తిరుగుతూ చేపలు పట్టారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వెల్లడించింది.

‘సెప్టెంబరు మధ్యలో తన పరివారంలోని చాలా మందికి కొవిడ్‌ సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అది పూర్తయిన తర్వాత పుతిన్‌ సైబీరియాలో కొన్ని రోజులు గడిపారు’ అని క్రెమ్లిన్‌ పేర్కొంది. తాజాగా పుతిన్ సైబీరియాలోని తిరుగుతూ ఒక నదిలో చేపలు పట్టిన ఫొటోలను క్రెమ్లిన్‌ విడుదల చేసింది. ఇందులో తనతో పాటు రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పుతిన్‌ గతంలో కళ్ల జోడు పెట్టుకొని గుర్రపు స్వారీ చేయడం, వేటకు రైఫిల్‌ను తీసుకెళ్లడం, ఫైటర్ జెట్‌ను నడపడం వంటి చిత్రాలు ఎందర్నో ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు అతని విహారయాత్రలో సాధారణంగా గడిపిన చిత్రాలను చూసి రష్యన్లతోపాటు నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని