టీకా ప్రభావం: ఆ దేశాధ్యక్షుడు ఏమన్నారంటే..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న అనంతరం తనకు అసౌకర్యంగా అనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆ దేశ మీడియాకు తెలిపారు. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్పభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని పుతిన్‌ పేర్కొన్నారు...

Updated : 13 Jul 2021 17:15 IST

మాస్కో: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న అనంతరం తనకు అసౌకర్యంగా అనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్పభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని పుతిన్‌ పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా మంగళవారం టీకా తీసుకున్నాను. తర్వాతి రోజు ఉదయం నా ఎముకల్లో కాస్త నొప్పిగా అనిపించింది. అయినా థర్మామీటర్‌లో శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలోనే చూపించింది’ అని ప్రెసిడెంట్ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్పుత్నిక్ వీ టీకా అందుబాటులో ఉందని ఆయన వివరించారు.

కాగా, దేశంలో 4.3 మిలియన్ల మంది వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని పుతిన్ గతంలో ప్రకటించారు. వేసవి చివరి నాటికి అందరిలో రోగనిరోధక శక్తి పెరగాలని కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు ఆకాంక్షించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని రష్యా డిసెంబర్‌లోనే ప్రారంభించిన విషయ తెలిసిందే.. ఈ క్రమంలో దేశంలో ఇంకా రెండొంతుల మంది స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తీసుకోలేదని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 4.5 మిలియన్‌ల మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని