Most searched personalities: నెట్‌లో ఎక్కువగా వీళ్ల గురించే వెతికరాట!

ఈ ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసిన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రెండో స్థానం సంపాదించుకున్నాడు. 

Published : 03 Dec 2021 23:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసిన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రెండో స్థానం సంపాదించుకున్నాడు. 2021 సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంగా ఈ ఏడాదికి గానూ యాహూ ఇండియా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ జాబితాను విడుదల చేసింది. 2017 నుంచి భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందగా.. గతేడాది మాత్రం దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా సెర్చ్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ తొలి స్థానంలో నిలవగా.. ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌ జాబితాలో ఆరోస్థానం దక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌ చోప్రా ఈ జాబితాలో 19వ స్థానం సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని