అమెరికాలో 16దాటిన వారికి టీకా..!

అమెరికాలో వ్యాక్సినేషన్‌ వేగవంతమైంది. తాజా ఆ దేశంలో 16 ఏళ్ల వయస్సు దాటిన వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా

Updated : 21 Dec 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో వ్యాక్సినేషన్‌ వేగవంతమైంది. తాజాగా ఆ దేశంలో 16 ఏళ్ల వయస్సు దాటిన వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సోమవారం ఓ ప్రకటన చేసింది. 16 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు వారిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి  తొలి ప్రాధాన్యంలో టీకా ఇవ్వనున్నారు.  ఇలాంటి వారికి కొవిడ్‌ సోకితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

వాస్తవానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ వయస్సు వారికి టీకాలు వేసేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకొన్న రాష్ట్రాల్లో అలాస్కా మొదటిది. ఇక్కడ 16 ఏళ్ల వయస్సు దాటితే టీకా తీసుకోవచ్చు. ఆ తర్వాత జార్జియా, టెక్సాస్‌,కాలిఫోర్నియాలు అదే బాటలో పయనించాయి. ఏప్రిల్‌ మొదట్లో అమెరికా అధ్యక్షుడు కూడా వ్యాక్సిన్‌ తీసుకునే అర్హత వయస్సును 18కి తీసుకురావాలని రాష్ట్రాలకు సూచించారు. తాజాగా సీడీసీ నిర్ణయంతో ఇది 16కు చేరింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని