Covid deaths: అమెరికాలో మృత్యు కేకలు.. రోజూ 2వేల మరణాలు

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గుతున్నట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి.....

Published : 20 Sep 2021 01:48 IST

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్‌తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది.

కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్‌ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఈ శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని