కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపుపై మరో అడుగు!

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు విషయంలో మరో అడుగు ముందుకు పడింది! కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు అంశంపై చర్చించినట్లు మంత్రి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Published : 12 Aug 2021 22:54 IST

దిల్లీ: కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు విషయంలో మరో అడుగు ముందుకు పడింది! కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు అంశంపై చర్చించినట్లు మంత్రి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మహమ్మారి కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించినట్లు తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేసిన ఈ టీకా.. ఇటీవల హంగేరి దేశానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ, న్యూట్రిషన్‌ నుంచి గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌(జీఎంపీ) గుర్తింపు పత్రం పొందిన విషయం తెలిసిందే. మరోవైపు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మిశ్రమంతో వైరస్‌ కట్టడిలో మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నట్లు ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని