అగ్రరాజ్యానికి‘కొత్త రకం’ కలవరం!

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్‌ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి.......

Published : 30 Jan 2021 13:09 IST

ఏప్రిల్‌ నాటికి ప్రబలరూపంగా యూకే రకం కరోనా: ఫౌచీ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్‌ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నాటికి అమెరికాలో యూకే వేరియంట్‌ ప్రబలంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, దక్షిణాఫ్రికా వేరియంట్‌పై మాత్రం ఇంకా స్పష్టత లేదని తెలిపారు. అమెరికాలో యూకే రకం వైరస్ ఇప్పటి వరకు 28 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 315 కేసులు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు అమెరికాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2.89 కోట్ల మందికి కనీసం ఒక డోసు ఇచ్చారు. మార్చి నాటికి తక్కువ వయసు వారికి కూడా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అనుకున్నదాని కంటే నెమ్మదిగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. జాన్స్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 2,59,29,282 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 4,36,678 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి...

బెడిసికొడుతున్న చైనా వ్యూహం!

14 రోజులు.. 33లక్షల మందికి టీకాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని