నెమ్మదిగా సడలింపులు ఇస్తాం..

బ్రిటన్‌లో బుధవారం నుంచి మూడోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విధించిన లాక్‌డౌన్‌కు ముగింపు నెమ్మదిగా సడలింపుల ద్వారానే ఉంటుందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

Published : 06 Jan 2021 23:31 IST

ఇంగ్లండ్‌ అన్‌లాక్‌ గురించి వెల్లడించిన బోరిస్‌

లండన్‌: బ్రిటన్‌లో బుధవారం నుంచి మూడోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విధించిన లాక్‌డౌన్‌కు  నెమ్మదిగా సడలింపుల ద్వారానే ముగింపు ఉంటుందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దశల వారీగా కఠిన ఆంక్షలు తొలగిస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్ విధించేందుకు ముందుగా చట్ట సభ్యుల మద్దతు తీసుకొనేందుకు ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. కాగా పాఠశాలలు మూసిఉంచేందుకు తాను విముఖంగా ఉన్నప్పటికీ చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా తాను ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని బోరిస్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మొదటిగా పాఠశాలలనే తెరుస్తానని ఆయన అన్నారు. గత లాక్‌డౌన్లలా కాకుండా ఈ సారి అన్‌లాక్‌ను చాలా నిర్ధిష్టంగా, నెమ్మదిగా చేస్తామని ఆయన తెలిపారు. కాగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు బ్రిటన్‌లో గణనీయంగా పెరుగుతుండటంతో ఆ దేశం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ స్ట్రెయిన్‌ త్వరగా వ్యాపించే లక్షణం కల్గి ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య బుధవారానికి 73కు చేరింది.

ఇవీ చదవండి..

భారత్‌లో కొత్త రకం కరోనా @73

ట్రాక్టర్‌ పరేడ్‌ కోసం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని