Updated : 31/10/2021 01:00 IST

J&K: జమ్మూలో పేలిన ‘ఉగ్రబాంబు’.. ఇద్దరు జవాన్ల బలి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మిలిటెంట్లు అమర్చిన ల్యాండ్‌మైన్‌ పేలి ఓ అధికారి సహా మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. నౌషేరా-సుందర్‌బని సెక్టార్‌లోని వాస్తవాధీనరేఖ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జవాన్లు నౌషేరా సెక్టార్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ.. ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ మీద కాలువేయడంతో ఈ ఘటన జరిగినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. లెఫ్టినెంట్‌ రిషి కుమార్‌, జవాను మంజిత్‌ వీరమరణం పొందినట్లు తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని