Covid 19: భారత్‌లో పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 2.58లక్షల కొత్త కేసులు.!

భారత్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది.

Updated : 17 Jan 2022 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్‌ కారణంగా  ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 

* భారత్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారించిన కేసుల సంఖ్య 6.02శాతం పెరిగి 8,209కు చేరింది. 

* దేశవ్యాప్తంగా 16,56,341 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 4.43శాతానికి సమానం. 

* గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్‌ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్‌లో రికవరీలు 94.27శాతంగా ఉన్నాయి. 

* ఇప్పటి వరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటికీ 13,79,62,181 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని