ట్రంప్‌ ఖాతాను నిషేధించడం సరైనదే

గతవారం అమెరికా కాపిటల్‌ భవనం వద్ద ట్రంప్‌ మద్దతుదారులు ఆందోళన చేసిన నేపథ్యంలో ట్విటర్‌ ట్రంప్‌ ఖాతాను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విటర్‌ సీఈవో జాన్‌ డోర్సే స్పందించారు. ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ నిషేధించడం సరైన నిర్ణయమని ఆయన అన్నారు.

Published : 15 Jan 2021 03:33 IST

చర్యను సమర్థించుకొన్న ట్విటర్‌ సీఈవో

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా కాంగ్రెస్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి తర్వాత ట్విటర్ చేపట్టిన చర్యలను కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే సమర్థించుకొన్నారు. ఈ ఘటన తర్వాత‌ ట్రంప్‌ ఖాతాను తొలగించిన తెలిసిందే. ట్విటర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వచ్చాయి.  ఈ అంశంపై ట్విటర్‌ సీఈవో జాక్‌‌ డోర్సే స్పందిస్తూ ట్రంప్‌ ఖాతాను నిషేధించడం సరైన నిర్ణయమే కానీ.. అదోక ప్రమాదకరమైన ఉదాహరణగా మిగిలిపోతుందని అంగీకరించారు. ట్రంప్‌ ఖాతాలో పోస్టు చేసిన అంశాలు హింసను ప్రేరేపించేలా ఉండటంతో  88మిలియన్ల ఫాలోవర్లులున్న ఖాతాను నిషేధించింది. కానీ ఇటువంటి విషయాలు ప్రజల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని డోర్సే ట్విటర్‌లో తెలిపారు.

మరోవైపు ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధమైన చర్యలతో ట్రంప్‌ ప్రాథమిక హక్కులకు హరించారని కొందరు ట్రంప్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఖాతాలను నిషేధించడాన్ని తాను గర్వంగా భావించట్లేదని డోర్సే వెల్లడించారు. కానీ, ఆన్‌లైన్‌ పోస్టులతో హింసను ప్రేరేపించడం కూడా నిజమే అని డోర్సే అన్నారు. తమ సంస్థ మాధ్యమం నుంచి ఏ విధమైన ప్రతికూల అంశాలు సమాజానికి చేరకూడదనే ఉద్దేశంతో గతేడాది ట్విటర్‌ నిబంధనలను సవరించింది.

ఇదే బాటలో స్నాప్‌చాట్‌..
ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాలు ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయడం, స్తంభింపజేయడం తెలిసిందే. వీటి జాబితాలో స్నాప్‌చాట్‌ కూడా చేరింది. ట్రంప్‌ ఖాతా స్నాప్‌చాట్‌లో కొనసాగడంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో.. శాశ్వతంగా నిషేధించింది.

ఇవీ చదవండి..

తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు

తొలిరోజు.. 3లక్షల మందికి టీకా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని