Hardeep on CAA: సీఏఏపై హర్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అక్కడున్న విదేశీయులు తమ దేశాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి కీలక వ్యాఖ్యలుచేశారు. అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులు గడ్డుపరిస్థితుల్లోకి జారుకున్నారని

Published : 23 Aug 2021 01:24 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అక్కడున్న విదేశీయులు తమ దేశాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి కీలక వ్యాఖ్యలుచేశారు. అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులు గడ్డుపరిస్థితుల్లోకి జారుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆవశ్యకతను ఈ పరిస్థితులు తెలియజేస్తున్నాయన్నారు. కాబుల్‌ నుంచి 168 మంది ప్రయాణికులు భారత్‌ చేరుకున్నారన్న వార్తను ట్వీట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అంశంపై గతంలో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగినప్పటికీ.. ఇటీవలి కాలంలో దీనిపై పెద్దగా చర్చలేదు. తాజాగా అఫ్గాన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వస్తోంది.

మరోవైపు తాలిబన్ల హస్తగతం అయ్యాక అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అఫ్గాన్‌ నుంచి బయల్దేరిన 168 మంది ప్రయాణికులు ఆదివారం సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. కాబూల్‌ నుంచి కతార్‌, తజకిస్థాన్‌ మీదుగా మరో 200 మంది సైతం భారత్‌లో అడుగుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని