Internet: ప్రపంచ జనాభాలో ఇప్పటికీ 37% మంది ఇంటర్నెట్‌కి దూరమే!

ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరి అయ్యాయి. దీంతో అందరికీ ఇంటర్నెట్‌ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కానీ.. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 37శాతం(290 కోట్ల)మంది ఇంటర్నెట్‌ వినియోగానికి

Updated : 02 Dec 2021 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరి అయ్యాయి. దీంతో అందరికీ ఇంటర్నెట్‌ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. కానీ.. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 37శాతం (290 కోట్ల) మంది ఇంటర్నెట్‌ వినియోగానికి దూరంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) వెల్లడించింది. ఈ 290 కోట్ల మందిలో 96శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. 

కరోనాకి ముందు అంటే 2019లో డిజిటల్‌కి మారిన వారి సంఖ్య 410కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 490కోట్లకు చేరినట్లు ఐటీయూ అంచనా వేసింది. అయినా, కోట్లాది మంది ఇంటర్నెట్‌ సదుపాయం లేక డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. పేద దేశాల్లో ఇంటర్నెట్‌కి అయ్యే ఖర్చులను ప్రజలు భరించలేక వినియోగించడం లేదని పేర్కొంది. పేదరికం, నిరాక్షరాస్యత, పరిమిత విద్యుత్‌ సదుపాయం, డిజిటల్‌ నైపుణ్యాల కొరత వారికి సవాళ్లుగా మారుతున్నాయని తెలిపింది. వారందరినీ డిజిటల్‌గా అనుసంధించడం కోసం.. వారికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఐటీయూ పేర్కొంది. 

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని