Omicron: ఒమిక్రాన్‌.. యువతకే ఎక్కువ సోకుతోంది: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే కారణం. ఇప్పటికే ఒమిక్రాన్‌ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఈ వేరియంట్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేసినా ఫలితం కనిపించట్లేదు. ఇప్పట్లో

Updated : 02 Dec 2021 12:26 IST

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఒమిక్రాన్‌ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఈ వేరియంట్‌పై వైద్యశాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేసినా ఫలితం కనిపించట్లేదు. ఇప్పట్లో దీని గురించి ఏమీ చెప్పలేమని అంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కూడా ఇదే మాట చెప్పారు. ఒమిక్రాన్‌ తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కష్టతరంగా ఉందని వెల్లడించారు. ‘ప్రస్తుతం ఈ వైరస్‌ ఎక్కువగా యువతకే సోకుతోంది. వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో తీవ్రత తెలియట్లేదు. ఇప్పుడు ఈ వైరస్‌ పెద్దవారికి సోకుతుండటం గమనించాం. అయితే, వారిలో తీవ్రమైన సమస్యలు కొన్ని వారాల వరకు కనిపించకపోవచ్చు’ అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది.. కానీ!

ఒకవైపు ఒమిక్రాన్‌ తీవ్రతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. మ్యూటెషన్‌ ప్రొఫైల్‌, వైరస్‌ స్వరూపాన్ని పరిశీలించగా.. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతున్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే, కొవిడ్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఒమిక్రాన్‌ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. 

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని