Union Minister: తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి.. మోదీ అభినందనలు

విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణం చికిత్స అందించిన కేంద్ర మంత్రి భాగవత్ కరాడ్‌కు నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు. మంగళవారం దిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 17 Nov 2021 12:19 IST

ఔరంగాబాద్‌: విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణం చికిత్స అందించిన కేంద్ర మంత్రి భాగవత్ కరాడ్‌కు నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు. మంగళవారం దిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇండిగో విమానం గాల్లోకి లేచాక ఓ ప్రయాణికుడికి రక్తపోటు సమస్య తలెత్తింది. విపరీతంగా చెమటలు పట్టడంతో పాటు బీపీ బాగా పడిపోయింది. దాంతో అతడు కళ్లు తిరిగిపడిపోయాడు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కరాడ్‌ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన వెంటనే స్పందించారు. తక్షణం ప్రథమ చికిత్స అందించి.. అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. గ్లూకోజ్ ఎక్కించడంతో పరిస్థితి మెరుగైందని కరాడ్ వెల్లడించారు. మంత్రి వెంటనే స్పందించి.. చికిత్స అందించిన తీరుకు ప్రధాని మోదీ అభినందనలు కూడా దక్కాయి. ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ వైద్యుడిగానే ఉన్నారంటూ మెచ్చుకున్నారు. నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తున్నారంటూ మంత్రి  వైద్యం అందిస్తోన్న చిత్రాన్ని ఇండిగో విమానయాన సంస్థ షేర్ చేసింది. ఆయన తీరు స్ఫూర్తిదాయకమని అభినందించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని