Published : 25/11/2021 08:27 IST

Gautam Gambhir: గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు.. భద్రత పెంపు

దిల్లీ: మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు ప్రాణహాని తలపెడతామంటూ ‘ఐఎస్‌ఐఎస్‌, కశ్మీర్‌’ పేరిట 24 గంటల్లోపు వ్యవధిలోనే 2 బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. గంభీర్‌ అధికారిక మెయిల్‌ ఐడీకి మంగళవారం రాత్రి  తొలి మెయిల్‌ వచ్చినట్లు చెప్పారు. ‘‘గంభీర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెట్టబోతున్నాం’’ అని ఆ మెయిల్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు గంభీర్‌ వ్యక్తిగత కార్యదర్శి గౌరవ్‌ అరోడా రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీపీ (సెంట్రల్‌) శ్వేతా చౌహాన్‌ తెలిపారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్‌ను పంపించినట్లు చెప్పారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం అదే ఐడీ నుంచి మరో మెయిల్‌ వచ్చినట్లు డీసీపీకి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు అందింది. రెండో మెయిల్‌లో గంభీర్‌ ఇంటికి సంబంధించిన ఓ వీడియోను పంపించారు. ‘‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న తప్పించుకున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లయితే రాజకీయాలకు, కశ్మీర్‌ అంశానికి దూరంగా ఉండు’’ అని రెండో మెయిల్‌లో గంభీర్‌ను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వ్యక్తిగతంగాను, దిల్లీలోని ఆయన ఇంటివద్ద భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని