Supreme Court: ‘కాలుష్యం తగ్గినా.. ఇక్కడితో కేసు మూసివేయం’

దిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. దేశ రాజధాని నగరంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో సుమారు మూడు వారాలుగా ప్రజలు కాలుష్య కోరల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు..‘ఒకవేళ కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈ కేసు మూసివేయబోం’ అంటూ స్పష్టం చేసింది.

Published : 24 Nov 2021 13:17 IST

దేశ రాజధాని గురించి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండని వ్యాఖ్య

దిల్లీ: దిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. దేశ రాజధాని నగరంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో సుమారు మూడు వారాలుగా ప్రజలు కాలుష్య కోరల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు..‘ఒకవేళ కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈ కేసు మూసివేయబోం’ అంటూ స్పష్టం చేసింది. 

‘ఇది దేశ రాజధాని. దిల్లీలో నెలకొన్న పరిస్థితితో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో చూడండి. ఈ మూడు రోజులు తగిన చర్యలు తీసుకోండి. ఈ లోగా పరిస్థితి మెరుగుపడితే.. కొన్ని నిషేధాజ్ఞలు ఎత్తివేయండి. ఒకవేళ కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం, తగిన ఆదేశాలు జారీచేస్తాం’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి  సుప్రీం స్పష్టంచేసింది. 

గణాంకాల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసి.. కాలుష్య పరిస్థితి తీవ్రంగా మారకముందే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. ‘దేశ రాజధానిలో గాలి నాణ్యతకు సంబంధించి ఆమోదయోగ్యమైన స్థాయుల్ని నిర్వచించాలి. సూపర్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా గణాంకాలకు సంబంధించి ఒక విధానం రూపొందించాల్సి ఉంది’ అని సూచించింది. అలాగే ఈ వాయు కాలుష్యంపై దిల్లీ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి అందులో వివరించింది. మరోపక్క దీనిపై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని