Justice NV Ramana: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి...

Published : 26 Nov 2021 16:54 IST

దిల్లీ: న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. నిజం వైపు నిర్భయంగా నిలబడటం సహా తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. ఎందరో న్యాయవాదులు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని.. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే వారికి నివాళి అర్పించినట్లే అని సీజేఐ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు