Gautam Gambhir: గంభీర్ ఇంటిముందు భద్రత కట్టుదిట్టం

మాజీ క్రికెటర్, లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని ఉందని బెదిరింపులు రావడంతో ఆయన ఇంటిముందు భద్రత కట్టుదిట్టమైంది. ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చిందని బుధవారం అధికారులు వెల్లడించారు. 

Updated : 24 Nov 2021 15:08 IST

ప్రాణహాని ఉందని బెదిరింపులు రావడంతో..

దిల్లీ: మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని ఉందని బెదిరింపులు రావడంతో ఆయన ఇంటిముందు భద్రత కట్టుదిట్టం చేశారు. ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చిందని బుధవారం అధికారులు వెల్లడించారు.

మంగళవారం రాత్రి 9.32 నిమిషాల సమయంలో గంభీర్‌కు ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి ఈమెయిల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ శ్వేతా చౌహాన్ వెల్లడిచారు. గంభీర్‌, ఆయన కుటుంబానికి ప్రాణ హాని తలపెట్టనున్నట్లు దాంట్లో బెదిరింపులు వచ్చాయని తెలిపారు.  దీనిపై మాజీ క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయన ఇంటి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు.

గౌతమ్ గంభీర్ 2019లో తూర్పు దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన ఆయన.. 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని