Published : 17/11/2021 16:02 IST

China: చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్​లు

బీజింగ్‌: కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్‌ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా.. చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్లు వారు వెల్లడించారు.

చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపైన కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. చైనాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షూసు మాట్లాడుతూ.. ‘ఈ పరీక్షల ద్వారా 71 రకాల వైరస్​లను గుర్తించాము. అందులో 45 వైరస్​లను కొత్తగా కనుగొన్నాము. వీటిలో 18 రకాల మనుషులు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవి. వైరస్​ల వ్యాప్తిలో వన్యప్రాణులే కీలక పాత్ర పోషిస్తాయి అనడానికి ఈ వివరాలే ఉదాహరణ’ అని పేర్కొన్నారు. పిల్లుల మాదిరిగా ఉండే ‘సివెట్స్’​ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదకర వైరస్​లను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్​కేయూ8 రకం వైరస్​ ఓ సివెట్​కు వ్యాప్తించినట్లు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని