స్కూళ్లు తెరిచి పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టలేం!

కరోనా వైరస్‌ మూడో ముప్పు పొంచి ఉండటంతో పాఠశాలల్లో ఇప్పట్లో భౌతిక తరగతులు నిర్వహించలేమని.....

Updated : 15 Jul 2021 18:11 IST

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ మూడో ముప్పు పొంచి ఉండటంతో పాఠశాలల్లో ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. కరోనా థర్డ్‌ వేవ్‌ ఆసన్నమైందన్న సూచనలు అంతర్జాతీయంగా కనబడుతున్నాయన్నారు. దిల్లీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే దాకా పిల్లలకు సంబంధించి ఎలాంటి రిస్క్‌ తీసుకోబోమని తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు. 

సుందర్‌లాల్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాస్తా!
 ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ సారథి సుందర్‌లాల్‌ బహుగుణకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నట్టు చెప్పారు. సుందర్‌లాల్‌ బహుగుణ మే 21న ఉత్తరాఖండ్‌లోని రిశికేష్‌లో కరోనా బారినపడి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దిల్లీ అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుందర్‌లాల్‌ బహుగుణకు కేజ్రీవాల్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సుందర్‌లాల్‌ బహుగుణ జీవితంలోని ప్రతి క్షణమూ ప్రజలకు స్ఫూర్తిదాయకమేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని