Delhi: దిల్లీలో రేపటి నుంచి పాఠశాలలు మూసివేత

వాయు కాలుష్య సంక్షోభంలో చిక్కుకున్న దిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు.

Updated : 02 Dec 2021 16:13 IST

వాయు కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో నిర్ణయం

దిల్లీ: వాయు కాలుష్య సంక్షోభంలో చిక్కుకున్న దిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని దిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో వాటిని తిరిగి తెరవడంపై ఈ రోజు దిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు’ అంటూ మందలించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

‘గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని మేం పాఠశాలలు తెరిచాం. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’ అని మంత్రి వెల్లడించారు. ఈ కాలుష్య పరిస్థితుల కారణంగా పది రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలు సోమవారం నుంచే నడుస్తున్నాయి. ఇప్పుడు వాటికి మళ్లీ బ్రేక్ పడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని