Om Prakash Chautala: పదో తరగతి పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి

86 ఏళ్ల వయస్సులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా పదో తరగతి పరీక్ష రాశారు. ఆయన సిర్సాలోని ఆర్య కన్యా సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంగ్లీషు పరీక్షకు హాజరయ్యారు. 

Published : 19 Aug 2021 23:44 IST

చండీగఢ్‌: 86 ఏళ్ల వయస్సులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా పదో తరగతి పరీక్ష రాశారు. ఆయన సిర్సాలోని ఆర్య కన్యా సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంగ్లీషు పరీక్షకు హాజరయ్యారు. 

ఈ ఏడాది ఆరంభంలో హరియాణా ఓపెన్ బోర్డు కింద చౌతాలా 12వ తరగతి పరీక్షలు రాశారు. అయితే ఆయన 10వ తరగతి ఇంగ్లీషులో పాస్ మార్కును సాధించలేకపోయారు. అది పాస్‌ అయ్యే వరకు 12వ తరగతి ఫలితాలను బోర్డు నిలిపివేసింది. దానికోసమే ఆయన బుధవారం ఇంగ్లీషు పరీక్షను రాయాల్సి వచ్చింది. కాగా, అనారోగ్యం కారణంగా పరీక్ష రాసేందుకు సహాయకుడి కోసం ఆయన అభ్యర్థన పెట్టుకున్నారు. బోర్డు నుంచి అనుమతి వచ్చిన అనంతరం ఆయన పరీక్షను పూర్తి చేశారు. అయితే ఆయన పరీక్షా కేంద్రానికి వచ్చిన క్రమంలో మీడియా ఆయనతో మాట్లేందుకు ప్రయత్నించగా..‘ నేను విద్యార్థిని. నో కామెంట్స్‌’ అని వ్యాఖ్యానించారు.  

ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయుల భర్తీలో జరిగిన అక్రమాలకుగానూ ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2013 నుంచి ఆయన తిహార్‌ జైల్లోనే శిక్షను అనుభవించారు. ఆ సమయంలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదే  జైలు నుంచి విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని