సంప్రదాయం మార్చని మోదీ.. ఈసారి కూడా వారితోనే దీపావళి..!

ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.

Published : 03 Nov 2021 18:51 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. గురువారం ఆయన నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు. 

ఇదిలా ఉండగా.. పూంచ్ ప్రాంతంలో గత 23 రోజులుగా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన జవాన్లలో మనోధైర్యాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని భారత్‌కు వచ్చిన వెంటనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం వ్యాక్సిన్ కవరేజ్ తక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని