Viral: విమానం ల్యాండింగ్‌ గేర్లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!

మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా నుంచి శనివారం ఉదయం ఓ విమానం మయామిలోని విమానాశ్రయంలో దిగింది. లోపల ఉన్న ప్రయాణికులు విమానంలోనుంచి కిందకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.....

Published : 29 Nov 2021 01:23 IST

మియామి: గ్వాటెమాలా నుంచి శనివారం ఉదయం ఓ విమానం మియామి విమానాశ్రయంలో దిగింది. లోపల ఉన్న ప్రయాణికులు విమానంలో నుంచి కిందకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బయట ఉన్న సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో విమానం నుంచి ఓ యువకుడు బయటకు వచ్చాడు. అతడిని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఎందుకంటే.. ఆ వ్యక్తి విమానం డోర్​ నుంచి బయటకు రాలేదు. ఫ్లైట్‌ కింద ఉండే ల్యాండింగ్​ గేర్​ నుంచి బయటకు దిగాడు.

గ్వాటెమాలా సిటీ నుంచి మియామి నగరానికి దాదాపు 1,640 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమెరికన్​ ఎయిర్​లైన్స్​ విమానంలో వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితే ఆ ప్రయాణం మొత్తం ఆ వ్యక్తి విమానం టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్‌ గేర్‌లోనే ఉన్నాడు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలను స్థానిక సిబ్బంది వీడియో తీశారు. సదరు వీడియోను స్థానిక వార్తాసంస్థ తన ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై వీడియో తీసిన విమానాశ్రయ సిబ్బంది స్పందించేందుకు నిరాకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. గ్యాటెమాలా దేశం అమెరికాకు దక్షిణాన ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.

 Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని