PM Modi: మోదీ ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలివే..

మోదీ ప్రభుత్వం 2014లో అధికారాన్ని చేపట్టిన తర్వాత వాడుకలో లేని 1428 చట్టాలను రద్దుపరిచింది. దీని కోసం ఇప్పటి వరకు ఆరు.. రద్దు, సవరణల చట్టాలను తీసుకొచ్చింది. చట్ట నిబంధనలకు స్పష్టత తీసుకొచ్చి వివాదాలను తగ్గించడానికి ఈ

Updated : 30 Nov 2021 08:48 IST

దిల్లీ: మోదీ ప్రభుత్వం 2014లో అధికారాన్ని చేపట్టిన తర్వాత వాడుకలో లేని 1428 చట్టాలను రద్దుపరిచింది. దీని కోసం ఇప్పటి వరకు ఆరు.. రద్దు, సవరణల చట్టాలను తీసుకొచ్చింది. చట్ట నిబంధనలకు స్పష్టత తీసుకొచ్చి వివాదాలను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2014లో నియమించిన రామానుజం కమిటీ దేశంలో 1824 చట్టాలు ఉపయోగంలో లేనివిగా తేల్చింది. వీటిలో 224 చట్టాలు రాష్ట్రాలు చేసినవి. కమిటీ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ‘రద్దు, సవరణ చట్టం’ ప్రకారం 2015లో 35 చట్టాలు, 2016లో 294 చట్టాలను తొలగించారు.

‘రద్దు, సవరణ చట్టా’న్ని 2019లో చివరిసారిగా వినియోగించారు. ఈ చట్టం ప్రకారం.. వినియోగంలో లేని 58 చట్టాలను ఆ ఏడాది రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం-1961, ఐఐఎం చట్టం-2017కు సవరణలను కేంద్రం తీసుకొచ్చింది.

2015లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌ను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకొంది. భూసేకరణ చట్టానికి సవరణలను ఆర్డినెన్స్‌ మార్గంలో తీసుకురాగా రైతులు వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. తాజాగా సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని