Kangana Ranaut: దిల్లీ అసెంబ్లీ ప్యానెల్‌ నుంచి కంగనకు సమన్లు

సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీన ఆమె ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ..

Updated : 25 Nov 2021 18:44 IST

దిల్లీ: సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీన ఆమె ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అసెంబ్లీ ప్యానెల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా నేతృత్వం వహిస్తున్నారు. 

మరోపక్క ఇదే విషయమై ముంబయిలో కంగనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రైతు ఉద్యమాన్ని ఖలిస్థానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన నేపథ్యంలో రైతు సంఘం నేతలు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ నాయకులు, శిరోమణి అకాలీదళ్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడుసాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు చేసిన నిరసనను ఖలిస్థానీ ఉద్యమంగా చిత్రీకరించడాన్ని వారు తప్పుపట్టారు. 

సాగు చట్టాలకు నిరసనగా రైతులు చేస్తోన్న ఉద్యమాన్ని కంగన మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. ఆ నిరసనల నేపథ్యంలో ఇటీవల కేంద్రం ఆ చట్టాలపై వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిపై ఆమె స్పందిస్తూ.. ‘విచారకరం, అవమానకరం, అన్యాయం’ అంటూ పోస్టు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని