Corona : 532 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న కొత్తగా 10 వేలకుపైగా కేసులు వెలుగు చూడగా.. 12 వేలకుపైగా రికవరీలు చోటుచేసుకున్నాయి.

Updated : 21 Nov 2021 10:13 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న కొత్తగా 10 వేలకుపైగా కేసులు వెలుగు చూడగా.. 12 వేలకుపైగా రికవరీలు చోటుచేసుకున్నాయి. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే మరణాల సంఖ్య మాత్రం కాస్త పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న 10,74,099 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,488  కొత్త కేసులు వెలుగుచూశాయి.

* గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో చికిత్స పొందుతూ 313 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,65,662కి చేరింది.

* గత కొన్ని రోజులుగా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా 12,329 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 98.30 శాతానికి పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఇదే అత్యధికం.

* రికవరీలు మెరుగ్గా ఉండటంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,22,714కి చేరింది. ఆ రేటు 0.36%కి తగ్గి.. 532 రోజుల కనిష్ఠానికి చేరింది.
* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 67,25,970 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 116 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని