US: కమలా హారిస్‌కు అమెరికా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు బదిలీ చేయనున్నారు. అయితే ఇది తాత్కాలికమే.......

Updated : 20 Nov 2021 10:35 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు బదిలీ చేయనున్నారు. అయితే ఇది తాత్కాలికమే. బైడెన్​కు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. తన బాధ్యతలను బైడెన్‌ తాత్కాలికంగా  ఉపాధ్యక్షురాలికి బదిలీచేయనున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్​కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. బైడెన్​ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. అందువల్ల ఆ సమయంలో కమలా హారిస్​కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్టు శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించనున్నారు.

‘రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి అధ్యక్షుడు బైడెన్ అనస్థీసియాలో ఉన్న కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారు’ అని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే తరహాలో.. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు. జో బైడెన్‌ ఈ శనివారం 79వ ఏట అడుగుపెట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని