Gujarat: రైతులకు గుడ్‌న్యూస్‌.. స్మార్ట్​ఫోన్​ కొనేందుకు ప్రభుత్వ సాయం

వ్యవసాయ రంగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుకున్న నేపథ్యంలో రైతులను అందులో భాగం చేయాలని నిర్ణయించింది గుజరాత్​ ప్రభుత్వం. ఇందుకుగాను స్మార్ట్​ఫోన్​ కొనుగోలు సాయం కింద......

Published : 21 Nov 2021 17:44 IST

అహ్మదాబాద్‌: వ్యవసాయ రంగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుకున్న నేపథ్యంలో రైతులను అందులో భాగం చేయాలని నిర్ణయించింది గుజరాత్​ ప్రభుత్వం. ఇందుకుగాను స్మార్ట్​ఫోన్​ కొనుగోలు సాయం కింద అన్నదాతలకు సుమారు రూ. 1,500 వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర​ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ సంబంధిత ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది.

భూమి కలిగిన ఎవరైనా అర్హులే

భూమి కలిగిన రైతులు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని గుజరాత్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొబైల్​ ఫోన్​ కొనుగోలు చేసే మొత్తం ఖర్చులో రూ.1,500కు మించకుండా 10 శాతం వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఐ-ఖేదుత్​ పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెల్​ఫోన్​కు సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు ఈ పథకం వర్తించదని తెలిపిన ప్రభుత్వం.. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని అర్హులేనని పేర్కొంది.

ప్రభుత్వ పథకాలపై అవగాహన

రైతుల వద్ద స్మార్ట్​ఫోన్​ ఉండడం ద్వారా వాతావరణ సమాచారం, పంటను చీడల నుంచి కాపాడుకోవడం, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాల గురించిన సమాచారం తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుంటూ.. నిపుణుల అభిప్రాయం సేకరించవచ్చని వివరించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఆమోదం పొందిన తరువాత.. లబ్ధిదారుడు ఫోన్ కొనుగోలు బిల్లు, మొబైల్ ఐఎంఈఐ నంబర్​, క్యాన్సిల్​ చెక్కు వంటి వాటి కాపీని ప్రభుత్వానికి అందించాలని గుజరాత్​ వ్యవసాయ శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని