Farm laws: సాగు చట్టాలు మంచివే.. కానీ విఫలమయ్యాం: వ్యవసాయ శాఖ మంత్రి
సాగు చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అభిప్రాయపడ్డారు......
దిల్లీ: సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వాగతించారు. అయితే చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో విఫలయ్యామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంటుందని, ఇలా చట్టాలను వెనక్కి తీసుకోవడం బాధ కలిగించిందన్నారు.
రైతుల సమస్యలు తొలగించేందుకే ఈ చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తోమర్ పునరుద్ఘాటించారు. వీటితో అన్నదాతలకు మంచి జరిగేదని.. వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. ‘ఈ చట్టాలతో కలిగే లాభాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయాం. చాలా బాధగా ఉంది. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నిత్యం శ్రమిస్తారు. కానీ కొందరికి ఈ చట్టాల్లో లోపాలు కనిపించాయి. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాం. కానీ ఫలితం దక్కలేదు’ అని తోమర్ పేర్కొన్నారు. 2014 నుంచి రైతుల కోసం చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
చాలా మంది రైతులు మద్దతిచ్చారు: యోగి
సాగు చట్టాల రద్దుపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తోమర్ తరహాలోనే స్పందించారు. ‘వాస్తవానికి రైతుల్లో చాలా మంది ఈ చట్టాలకు మద్దతిచ్చారు. వీటితో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించవచ్చని విశ్వసించారు. కొందరికి మాత్రమే ఈ చట్టాలు నచ్చలేదు. ఆ రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. కానీ ప్రజలకు మేము ఏం చెబుదామని అనుకున్నామో, అందులో విజయం సాధించలేకపోయాము. ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇదొక చారిత్రక నిర్ణయం’ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం పేర్కొన్నారు.
మోదీపై షా ప్రశంసలు
సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘గురునానక్ జయంతి రోజు మోదీ ఈ ప్రకటన చేయడం ఎంతో ప్రత్యేకం. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ఇతర ఆలోచనలు లేవని ఇది నిరూపిస్తోంది. మోదీ తన అనుభవం, నాయకత్వ లక్షణాలను మరోసారి చూపించారు. మోదీ చెప్పినట్టే.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం కృషిచేస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్‌మాడ్‌లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్‌షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్‌షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్‌లో రైల్వేట్రాక్‌పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్‌లో చిత్రహింసలు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్‌లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై