Farm laws: సిరా తప్ప ఆ చట్టాల్లో నలుపు ఏముందో చెప్పలేకపోయారు

సాగుచట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రధాని నరేంద్రమోదీ నిన్న దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అందుకు తాను ఎవరిని విమర్శించబోవడం లేదని వెల్లడించారు. అయితే ఆ ప్రకటనపై తాజాగా కేంద్రమంత్రి వీకే సింగ్ స్పందించారు. రైతు సంఘాల్లో ఉన్న ఆధిపత్య పోటీనే చట్టాల రద్దుకు కారణమైందని విమర్శలు గుప్పించారు.

Published : 21 Nov 2021 01:15 IST

అందుకే సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన చేశారు: వీకే సింగ్

దిల్లీ: సాగుచట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రధాని నరేంద్రమోదీ నిన్న దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అందుకు తాను ఎవరిని విమర్శించబోవడం లేదని వెల్లడించారు. అయితే ఆ ప్రకటనపై తాజాగా కేంద్రమంత్రి వీకే సింగ్ స్పందించారు. రైతు సంఘాల్లో ఉన్న ఆధిపత్య పోటీనే చట్టాల రద్దుకు కారణమైందని విమర్శలు గుప్పించారు.  

‘కొన్నిసార్లు మనం విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నప్పటికీ.. వేరొకరిని గుడ్డిగా అనుసరిస్తాం. నల్ల చట్టాలు అని మీరు చెప్పిన ఈ చట్టాల్లో నలుపు ఏంటని నేను ఒక రైతు నాయకుడిని అడిగాను. ఇందులో వాడిన సిరా తప్ప నలుపు ఏముందని ప్రశ్నించాను. ఆ నాయకుడు నా మాటను అంగీకరిస్తూనే..ఇవి నల్ల చట్టాలేనని అన్నారు. ఇంక ఈ వైఖరిని ఎవరు మార్చగలరు? రైతు సంఘాల మధ్య ఆధిపత్యం కోసం పోటీ నడుస్తోంది. కొన్ని కారణాల వల్ల వారు చిన్నకారు రైతులకు అందే లాభాల గురించి ఆలోచించడం లేదు. అందుకే ప్రధాని ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నారు’ అని వీకే సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ.. శుక్రవారం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘‘మా ప్రభుత్వం ఏం చేసినా అది రైతుల కోసమే. ఏం చేస్తున్నా.. అది దేశం కోసమే. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే తీసుకొచ్చాం. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్దిచెప్పలేకపోయాం. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం.. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి’’ అంటూ మోదీ నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని