Divorce: నల్లగా ఉందని భార్యకు విడాకులు

నల్లగా ఉన్నాననే కారణం చెబుతూ తనకు తలాక్‌ చెప్పాడని భర్తపై కేసు పెట్టింది ఓ మహిళ. వివాహం జరిగిన తొమ్మిది నెలలకే విడాకులు ఇచ్చిన ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని

Updated : 22 Nov 2021 08:12 IST

ల్లగా ఉన్నాననే కారణం చెబుతూ తనకు తలాక్‌ చెప్పాడని భర్తపై కేసు పెట్టింది ఓ మహిళ. వివాహం జరిగిన తొమ్మిది నెలలకే విడాకులు ఇచ్చిన ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగింది. నల్లగా ఉన్నానని తన భర్త, అత్తింటివారు హేళన చేయటం సహా హింసిస్తున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న బాధిత మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు మూడెకరాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని, దాంతో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఒత్తిడి చేశారు. అందుకు నిరాకరించటం వల్ల పలుమార్లు దాడి చేశారు. గృహహింస, ముమ్మారు తలాక్‌, నల్లగా ఉందని హేళన, అదనపు కట్నం కోసం వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని