Modi: వలసవాద మనస్తత్వం.. భారత ప్రగతికి ఆటంకం: ప్రధాని

వలసవాద మనస్తత్వం కారణంగా దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు కార్బన్‌ను అత్యధికంగా విడుదల చేసిన అభివృద్ధి చెందిన దేశాలే.....

Published : 26 Nov 2021 22:39 IST

దిల్లీ: వలసవాద మనస్తత్వం కారణంగా దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు కార్బన్‌ను అత్యధికంగా విడుదల చేసిన అభివృద్ధి చెందిన దేశాలే ప్రస్తుతం భారత్‌పై ఒత్తిడి తెస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సమక్షంలో జరిగిన కార్యక్రమం వేదికగా మోదీ మాట్లాడారు. తరతరాలుగా ఒకే కుటుంబం ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్యానికి ముప్పు తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించిన ప్రధాని.. రెండోసారి మాట్లాడారు.

‘వలసవాద మనస్తత్వం ఇంకా ఉంది. ఈ వలసవాదాన్ని ప్రోత్సహించే శక్తులు.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం మనది. అయినప్పటికీ.. పర్యావరణం పేరుతో భారత్‌ను అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికంతటికీ వలసవాద మనస్తత్వమే కారణం. దురదృష్టవశాత్తు మన దేశంలోనూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొన్నిసార్లు దేశ ప్రగతికి ఈ వలసవాదం ఆటంకంగా నిలుస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘సబ్​ కా సాత్​​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా​ ప్రయాస్​’ అనే సూత్రం.. రాజ్యాంగం స్ఫూర్తికి చిహ్నం అని మోదీ అన్నారు. రాజ్యంగానికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి ఫలాలను ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ సమానంగా అందిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని