Afghanistan Blasts: అఫ్గాన్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో పలువురు మృత్యువాతపడగా.. చాలామంది గాయాలపాలైనట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Published : 03 Oct 2021 18:15 IST

పేలుడు ఘటనను ధ్రువీకరించిన తాలిబన్లు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో పలువురు మృత్యువాతపడగా.. చాలామంది గాయాలపాలైనట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు. తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ అమ్మ స్మారక సభ జరుగుతోన్న ఓ మసీదు లక్ష్యంగా చేసుకొని ఈ పేలుళ్లు జరిగినట్లు తెలిపారు. గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాలిబన్లకు శత్రువులుగా భావించే వీరి ప్రాబల్యం నంగర్‌హార్‌ తూర్పు ప్రావిన్సులో అధికంగా ఉంది. జలాలాబాద్‌లోనూ ఇదివరకు హత్యలు, దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ఇదివరకు ప్రకటించుకుంది. అయితే, కాబుల్‌లో మాత్రం ఈ తరహా దాడులు అత్యంత అరుదనే చెప్పవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని