Surprise Gift: కాబోయే భార్యకు భారీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

కాబోయే భార్యకు ఓ వరుడు ఇచ్చిన భారీ కానుకను చూసి ఆ వధువుతో పాటు బంధువులూ ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి భర్త తనకు దొరికాడని ఆమె మురిసిపోగా..

Updated : 18 Oct 2021 10:07 IST

 

బీజింగ్‌: కాబోయే భార్యకు ఓ వరుడు ఇచ్చిన భారీ కానుకను చూసి ఆ వధువుతో పాటు బంధువులూ ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి భర్త తనకు దొరికాడని ఆమె మురిసిపోగా.. నీ ప్రేమ బంగారంగానూ అంటూ బంధువులు దీవించారు. చైనాలోని హుబే రాష్ట్రంలో సెప్టెంబర్‌ 30న ఓ వివాహ వేడుక జరిగింది. అక్కడకు వెళ్లిన అతిథులు వధువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ వధువు 60 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం అందుకు కారణం! ఆ నగలను వరుడు కానుకగా ఇచ్చాడు. 60 బంగారు నెక్లెస్‌లు(ఒక్కోటి కిలో బరువు), నాలుగు భారీ బంగారు గాజులు బహుమతిగా ఇచ్చాడు. అంతటి బరువున్న ఆభరణాలు ధరించిన వధువు అసలు నడవలేకపోయింది. అది గమనించిన వరుడు ఆమెకు సహాయం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని