పుట్టుకతోనే ఆ బాలిక కడుపులో బిడ్డ..

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక రోష్ని పుట్టినప్పటి నుంచి కడుపునొప్పితో బాధ పడుతుండేది. ఆమెకు ఇటీవలే సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించిన ముంబయి వైద్యులు ఆ నొప్పికి గల కారణాలను చెప్పగా..

Updated : 01 Dec 2021 06:53 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక రోష్ని పుట్టినప్పటి నుంచి కడుపునొప్పితో బాధ పడుతుండేది. ఆమెకు ఇటీవలే సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించిన ముంబయి వైద్యులు ఆ నొప్పికి గల కారణాలను చెప్పగా.. తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదని.. అక్కడున్నది తల, కళ్లు, చేతులు, కాళ్లు ఉన్న ఓ మృతశిశువు అని తేల్చారు. పుట్టుకతోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడే ఆ బాలికతో పాటే కడుపులోని శిశువు సైతం పెరుగుతూ వచ్చిందని వైద్యులు తెలిపారు. కడుపు నొప్పి అని రోష్ని ఇబ్బంది పడినప్పుడల్లా తల్లిదండ్రులు.. ఆస్పత్రులతో పాటు భూతవైద్యులకు చూపించేవారు. చివరకు నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో ముంబయిలోని సియాన్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. తీవ్రంగా శ్రమించి.. విజయవంతమయ్యారు. ఎట్టకేలకు చిన్నారి కడుపులోని మృతశిశువును బయటకు తీశారు. ‘‘ఆపరేషన్‌ విజయవంతమైంది.. బాలిక తన జీవితాన్ని తోటివారి లాగే కొనసాగించగలుగుతుంది’’ అని డాక్టర్‌ జోషి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని