Published : 27/10/2021 12:35 IST

Drone: క్రమబద్ధంగా డ్రోన్ల ట్రాఫిక్‌.. ప్రణాళిక రూపొందించిన కేంద్రం

 పర్యవేక్షణలో ప్రైవేటు సంస్థలకు పాత్ర

దిల్లీ: డ్రోన్ల వినియోగం పెరుగుతుండడంతో వాటి ‘ట్రాఫిక్‌’ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డ్రోన్ల ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళిక’ను రూపొందిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు, తృతీయపక్ష సేవలు అందించే సంస్థలు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం వాయు మార్గాలపై ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (ఏటీఎం) విధానం అమల్లో ఉంది. ఇది మానవ రహిత విమానాల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో కొత్త విధానాన్ని రూపొందించింది.

డ్రోన్లను మానవ రహిత విమానాలుగా పరిగణిస్తున్నందున దీని కోసం అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టం ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ను రూపొందించింది. దీన్ని యూటీఎంగా వ్యవహరిస్తోంది. ఇది ఆటోమేటిక్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సహకారంతో పనిచేస్తుంది.
భవిష్యత్తుల్లో ఏటీఎం, యూటీఎం వ్యవస్థలను అనుసంధానం చేసి పరస్పర ప్రయోజనాలు పొందాలని ప్రతిపాదించింది.
ప్రైవేటు సంస్థలు రిజిస్ట్రేషన్, ఫ్లైట్‌ ప్లానింగ్, ఎగిరే డ్రోన్ల మధ్య దూరం ఉండేలా చూడడం, వాతావరణం సమాచారం తెలపడం వంటి సేవలు అందించవచ్చు. పైలట్లతో నడుస్తున్న విమానాలు కూడా ఎక్కడ ఉన్నాయన్న సంగతినీ తెలుసుకోవచ్చు.
బీమా, డాటా విశ్లేషణ వంటి అనుబంధ సేవలను కూడా అందించవచ్చు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్‌ నిర్వాహకులు అనుమతులు పొందాల్సి ఉంటుంది.
డ్రోన్లు ప్రయాణం విషయమై ఏర్పాటు చేసే కేంద్రానికి ప్రతి నిర్వాహకుడు కూడా సమాచారం ఇవ్వాలి. అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోందన్న వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తుండాలి. ఇది నేరుగాగానీ, తృతీయ పక్ష సేవలు అందించే సంస్థ ద్వారాగానీ ఇవ్వవచ్చు. ఈ సేవలు అందించే సంస్థకు తొలుత తక్కువ పరిధిలో ఉండే భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. అనంతరం ఆ పరిధిని విస్తరిస్తారు.
ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థలు రుసుములు వసూలు చేయవచ్చు. ఇందులో కొంతభాగాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవలు అందించే సంస్థలు ఆటోమేటెడ్‌గా పనిచేసే ఆల్గారిథం ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, అందువల్ల ఆ సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ స్మిత్‌ షా కోరారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని