PM Modi: ప్రజామోదంలో మోదీనే నంబర్‌ 1

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికాకు చెందిన....

Updated : 08 Nov 2021 09:35 IST

మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వే

ప్రపంచ నేతల్లో అగ్రగామి..    6వ స్థానంలో బైడెన్‌

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ వివరాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సర్వే ప్రకారం మోదీ 70 శాతం ప్రజామోదంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.  

* మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ సర్వేలో గతేడాది కూడా మోదీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి భారత్‌లో 2,126 మందిని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ చేసిందీ సర్వే సంస్థ.

ప్రజామోదంలో టాప్‌ లీడర్లు..

నరేంద్ర మోదీ 70%

లోపెజ్‌ ఒబ్రేడర్‌, మెక్సికో అధ్యక్షుడు 66%

మారియో డ్రాగీ, ఇటలీ ప్రధాని 58%

ఏంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్సలర్‌ 54%

స్కాట్‌ మోరిసన్‌, ఆస్ట్రేలియా ప్రధాని 47%

జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు 44%

జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని 43%

ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని 42%

మూన్‌ జే-ఇన్‌- ద.కొరియా అధ్యక్షుడు 41%

బోరిస్‌ జాన్సన్‌, బ్రిటన్‌ ప్రధాని 40%

పెడ్రో సాంచెజ్‌, స్పెయిన్‌ ప్రధాని 37%

ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (ఫ్రాన్స్‌) 36%

జైర్‌ బోల్సొనారో, బ్రెజిల్‌ అధ్యక్షుడు 35%

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని