Supreme Court: సుప్రీంలో అసాధారణ దృశ్యం!

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఆసుపత్రి

Published : 07 Oct 2021 07:49 IST

ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది

దిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు విచారణలు వర్చువల్‌ విధానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించే సమయానికి సీనియర్‌ న్యాయవాది ఆసుపత్రిలో ఉన్న దృశ్యం స్క్రీన్‌పై కనిపించింది. ఆయన వాదనలు వినిపించడానికి ఉద్యుక్తులవుతుండగా ‘‘ముందు...మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి?’’ అంటూ సీనియర్‌ న్యాయవాదిని జస్టిస్‌ నాగేశ్వరరావు పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని