US: ఉద్యోగాలకు గుడ్‌బై.. ఒక్క నెలలోనే 44 లక్షల మంది రాజీనామా!

అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు.....

Published : 14 Nov 2021 01:29 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా.. సెప్టెంబర్​లో ఈ సంఖ్య 44 లక్షలుగా నమోదైంది. సెప్టెంబర్​లో 44 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతం కావడం గమనార్హం.

కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. భారీగా ఉద్యోగాలు వదులుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతున్నప్పటికీ వారికి ఉద్యోగార్థులు లభించడం లేదు. శీతాకాల సెలవులు, క్రిస్మస్ సీజన్ ఉన్న నేపథ్యంలో అనేక సంస్థలు అదనంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని