Mexico: భయానకం! వంతెన​ కింద వేలాడిన 9 మృతదేహాలు.. వారి పనేనా?

మెక్సికోలోని జకాటెకాస్​ రాష్ట్రంలో గురువారం ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఫ్లైఓవర్​ కింద 9 మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని కొందరు చూసి భయకంపితులయ్యారు......

Published : 19 Nov 2021 16:52 IST

జకాటెకాస్‌: మెక్సికోలోని జకాటెకాస్​ రాష్ట్రంలో గురువారం ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఫ్లైఓవర్​ కింద 9 మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని కొందరు చూసి భయకంపితులయ్యారు. అధికారులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరో మృతదేహాన్ని సైతం దూరంగా దారిపక్కన గుర్తించినట్లు తెలిపారు.  ‘మృతదేహాలను మెక్సికో నగరానికి ఉత్తరాన 550 కిలోమీటర్ల దూరంలోని సియుడాడ్​ క్యూటెమోక్​లో గుర్తించాం. పదో మృతదేహం దారి పక్కన కనిపించింది. మృతులంతా పురుషులే’ అని జకాటెకాస్​ రాష్ట్ర పబ్లిక్​ సేఫ్టీ ఏజెన్సీ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో డ్రగ్స్​ ముఠాలే ఈ పనిచేసినట్లు తెలుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మత్తు పదార్థాలను సరఫరా చేసే కీలక ప్రాంతంగా జకాటెకాస్‌కు పేరుంది. ముఖ్యంగా శక్తిమంతమైన సింథటిక్​ పెయిన్​కిల్లర్​ ఫెంటనైల్​ వంటి వాటిని అమెరికా సరిహద్దులకు ఇక్కడి నుంచే చేరవేస్తారు. దీంతో ఈ రాష్ట్రంపై పట్టు సాధించేందుకు డ్రగ్స్​ సరఫరా ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యర్థులు, అధికారులు, స్థానికులను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఇలా మృతదేహాలను బహిరంగంగా వేలాడదీస్తారని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ ముఠా దాడుల్లో ఈ ఏడాది 25 వేల మంది హత్యకు గురయ్యారని, గతేడాదితో పోల్చితే 3.4 శాతం తక్కువని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు