Taliban: అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బలప్రదర్శన

అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో తాలిబన్లు ఆదివారం బల ప్రదర్శన నిర్వహించారు.  వీటిల్లో అమెరికా సాయుధ వాహనాలు, రష్యా హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఆగస్టులో పౌర

Published : 15 Nov 2021 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో తాలిబన్లు ఆదివారం బల ప్రదర్శన నిర్వహించారు.  వీటిల్లో అమెరికా సాయుధ వాహనాలు, రష్యా హెలికాప్టర్లు ఉన్నాయి. ఆగస్టులో పౌర ప్రభుత్వం కుప్పకూలి తాలిబన్లు అధికారంలోకి రావడంతో వారు ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు.

ఈ కవాతులో అమెరికా తయారు చేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్‌ తుపాకులు వంటి వాటిని ప్రదర్శించారు. అఫ్గాన్‌ జాతీయ దళాల్లో పనిచేసిన పైలట్లు, మెకానిక్‌లను తాజాగా తమ బలగాల్లో చేర్చుకొంటున్నట్ల తాలిబన్‌ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్లు ఇటీవల మిలటరీ దుస్తులను వాడటం మొదలు పెట్టారు. గతంలో తాలిబన్‌ ఫైటర్లు కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించేవారు.

ఇమ్రాన్‌- పాక్‌ తాలిబన్లకు మధ్యవర్తిగా తాలిబన్లు..!

ఇటీవల పాక్‌ ప్రభుత్వానికి, ఉగ్ర సంస్థ తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ ఉగ్ర సంస్థకు మధ్య అఫ్గాన్‌ తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ కాన్‌ ముత్తాఖీ స్వయంగా తెలిపారు. పాక్‌కు చెందిన జియో టీవీకి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పాలసీలో భాగంగా ఈ పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ చర్చల ఫలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్చలు అఫ్గానిస్థాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ సిరాజుద్దీన్‌ హక్కానీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాలపాటు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని