రైతుల ఉద్యమానికి మద్దతు ఉంటుంది: బాదల్‌

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం గాజీపూర్‌ సరిహద్దుల్లో రైతు సంఘాల.........

Published : 01 Feb 2021 01:18 IST

ఛండీగఢ్‌: కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం గాజీపూర్‌ సరిహద్దుల్లో రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ను కలిసి మాట్లాడారు. గౌరవ సూచకంగా  టికాయిత్‌కు ఖడ్గాన్ని బహూకరించారు. 

‘రాకేశ్‌ టికాయిత్‌ తన తండ్రి మహేంద్ర సింగ్‌ టికాయిత్‌ మార్గాన్ని అనుసరిస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతు సమాజాన్ని గర్వించేవిధంగా చేశారు. రైతుల సంక్షేమం కోసం మహేంద్ర సింగ్‌ టికాయిత్‌, ఎస్‌ఏడీ వ్యవస్థాపకులు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంయుక్తంగా గొప్ప పోరాటాలు చేశారు. రాకేశ్‌ నేతృత్వంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుంది’ అని బాదల్‌ హామీ ఇచ్చారు.

రైతులు చేస్తున్న ఈ గొప్ప పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ కలిసి రావాలని సుఖబీర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన జనవరి 26న నిరసనల్లో పాల్గొని అరెస్టైన రైతుల కుటుంబాలను కలిశారు. వారికి న్యాయపరమైన సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా.. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. 

ఇదీ చదవండి

‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని