Updated : 17/11/2021 15:23 IST

Delhi pollution: దిల్లీ చుట్టుపక్కల ఆరు విద్యుత్‌ కర్మాగారాల మూసివేత..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దిల్లీ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఆరు థర్మల్‌ పవర్‌ విద్యుత్తు  కేంద్రాలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. కేవలం నిత్యావసరాలను తరలించేవి తప్ప మరే ఇతర ట్రక్కులను దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోకి అనుమతించవద్దని పేర్కొంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌,పంజాబ్‌,రాజస్థాన్‌, హరియాణ రాష్ట్రాల  ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. 

దిల్లీలో వాయుకాలుష్యం అడ్డుకట్టకు అత్యవసరంగా వాహనాల కదలికలు, పరిశ్రమల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే దిల్లీలో పాఠశాలలు 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ మాధ్యమంలో బోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు నిర్మాణ రంగ పనులను కూడా నిలిపివేశారు. 

ప్రతిఏటా శీతాకాలంలో దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కొన్నేళ్ల నుంచి దీనికి పరిష్కారం కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని