Vaccine: పిల్లలకు టీకా వేస్తున్న మొదటి దేశం సింగపూర్‌

కౌమారదశలో ఉన్న పిల్లలకు కరోనా టీకా వేసేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి 12-18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయనున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు వ్యాధి బారిన పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 31 May 2021 20:28 IST

సింగపూర్‌: కౌమారదశలో ఉన్న పిల్లలకు కరోనా టీకా వేసేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి 12-18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయనున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు వ్యాధి బారిన పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పిల్లలకు టీకా ఇస్తున్న మొట్టమొదటి దేశంగా సింగపూర్‌ నిలిచింది. ప్రస్తుతం ఆ దేశంలో 18 నుంచి 39 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. వీరితోపాటే కౌమారంలో ఉన్నవారికి కూడా మంగళవారం నుంచి టీకాలు ఇవ్వనున్నారు.

ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలోపు కొవిడ్‌ బారిన పడుతున్నవారిని గుర్తించి, ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సింగపూర్‌ ప్రధాని లీ షేన్‌ లూంగ్‌ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. జాతీయ దినోత్సవం ఆగస్టు 9 నాటికి అర్హులైన వారందరికీ కనీసం ఒక్క డోసునైనా అందించనున్నామని తెలిపారు.

57 లక్షల జనాభా ఉన్న సింగపూర్‌లో ఇప్పటివరకు 75 శాతం మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. చాలామంది రెండో డోసు కూడా తీసుకున్నారు. కొవిడ్‌ కారణంగా సింగపూర్‌లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని