Vaccination Drive: ప్రధానిసమర్థ నాయకత్వం వల్లేఈ ఘనత సాధ్యమైంది: అమిత్‌ షా

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు......

Published : 17 Jan 2022 01:27 IST

దిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు కేంద్రం 156 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసింది. వ్యాక్సినేషన్‌లో భారత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ఘనత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వల్లే సాధ్యమైందని అమిత్‌షా అన్నారు.

‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం, అంకితభావం, నిరంతర కృషి వల్లే ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలిచాం. ప్రభుత్వాలు, ప్రజలు ఏకమై.. ఒక లక్ష్యం పెట్టుకుంటే దేశం అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలదు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలదు. ప్ర‌ధాని మోదీ ప‌టిష్ట, స్ఫూర్తిదాయ‌క నేతృత్వంలో.. కొవిడ్‌పై పోరాటంలో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు సహా ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులు, పౌరులందరికీ నా అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గతేడాది జనవరి 16న  ప్రారంభం కాగా నేటితో ఏడాది పూర్తయ్యింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలోని 93 శాతం వయోజనులు కనీసం టీకా మొదటి డోసు తీసుకున్నారు. 69.8 శాతం మంది పూర్తిగా టీకాలు పొందారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, మరికొందరి కూడా కొద్దిరోజులుగా ‘ప్రికాషనరీ డోసు’ అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు