Novavax: జులైలో పిల్లలపై ‘సీరమ్‌’ ట్రయల్స్‌?

నోవావాక్స్‌ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయత్నాలు చేస్తోంది. జులైలో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం......

Updated : 17 Jun 2021 17:48 IST

పుణె‌: నోవావాక్స్‌ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయత్నాలు చేస్తోంది. జులైలో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కరోనా నివారణలో తమ టీకా 90.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్లనూ అడ్డుకోగలదని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ కంపెనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న ‘సీరమ్‌’ సెప్టెంబర్‌ కల్లా భారత్‌లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, అలాగే జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని