వాట్సప్‌లో భద్రతపరమైన లోపాలు

విస్తృతంగా వాడకంలో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో భద్రతపరమైన కొన్ని ముప్పులు పొంచి

Updated : 18 Apr 2021 09:54 IST

సైబర్‌ సంస్థ హెచ్చరిక

దిల్లీ: విస్తృతంగా వాడకంలో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో భద్రతపరమైన కొన్ని ముప్పులు పొంచి ఉన్నాయని భారత సైబర్‌ భద్రతా సంస్థ ‘సెర్ట్‌-ఇన్‌’ హెచ్చరించింది. వీటివల్ల సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీని తీవ్రత రేటింగ్‌ చాలా ‘అధికం’గా ఉందని తెలిపింది. వీ2.21.4.18 (ఆండ్రాయిడ్‌), వీ2.21.32 (ఐవోఎస్‌)కు ముందున్న వాట్సప్‌ వెర్షన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఈ ముప్పులను గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ యాప్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్, ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి వాట్సప్‌కు సంబంధించిన తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని